Saakshyam
Nothing scared but the truth

చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్న కాంగ్రెస్ పార్టీ

Chandrababu trapped congress party in a cage

0

Chandrababu trapped congress party in a cage | telugu political news

ఒకే వేధికపైకి వచ్చి ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేయడం. రాహుల్‌గాంధీ కనీసం కాంగ్రెస్‌ పక్షాన ఉమ్మడి ఏపీకి పనిచేసిన ముఖ్యమంత్రుల (Chandrababu trapped congress party in a cage) పేర్లలో ఒక్కటి కూడా ప్రస్తావించకుండా చంద్రబాబు గురించే మాట్లాడడం, చంద్రబాబును మెచ్చుకుని రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ శ్రేణులకు ఏమి సందేశం ఇచ్చారో అర్ధంకాదు. చంద్రబాబు కూడా గతంలో కాంగ్రెస్‌ను నానాతిట్లు తిట్టినా, ఇప్పుడు దేశంకోసం కాంగ్రెస్‌తో కలిశానని చెప్పడం.. రాజకీయ విలువలకే వీరిద్దరూ కొత్త అర్థం చెప్పారు.

రాజకీయం అంటే పచ్చి అవకాశవాదమని వీరిద్దరూ నిరూపించారు. అలాగే 2014కి ముందు ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాలను, కాంగ్రెస్‌పార్టీ ఎన్ని విమర్శలు చేసేదో కూడా తెలుసు. అయినా వారిద్దరూ పక్కనపక్కన కూర్చోవడమే కాకుండా, ఒకేదండను కూడా వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. మరి ఇంతకాలం పోటీపడ్డ కాంగ్రెస్‌ తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలే ఆత్మాభిమానం లేనివారా? కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన ప్రచార ప్రకటనలలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్‌ బొమ్మవేశారు కానీ, కాంగ్రెస్‌ పూర్వ ముఖ్యమంత్రుల బొమ్మలు మాత్రం వేసుకోలేదు. ఇదంతా చూస్తుంటే నిజంగానే చంద్రబాబు ట్రాప్‌లో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ పడిందా అన్నడౌటు వస్తుంది. అదే సమయంలో ఎన్‌టీఆర్‌ బొమ్మను కాంగ్రెస్‌ ప్రచార ప్రకటనలలోకి అనుమతించడం, స్వయంగా చంద్రబాబే కాంగ్రెస్‌ కండువాను వేసుకోవలసిన పరిస్థితి రావడం.. ఇవన్ని చూస్తుంటే తెలుగుదేశంపార్టీ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్‌కు కట్టబెట్టిందన్న భావన ఏర్పడుతుంది.

Chandrababu trapped congress party in a cage

కానీ రాహుల్‌గాంధీ, చంద్రబాబులు తమ కలయిక అవసరం ఏమిటో వివరించడంలో అంతగా సఫలం అయినట్లు కనిపించలేదు. సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని బండబూతులు చందంగా విమర్శించేవారు. మరి వాటిని ఎవరూ గుర్తు చేసుకోలేదు. పైగా పైకిమాత్రం ఎప్పటి నుంచో ఉన్న బంధం మాదిరి ఎవరికి వారు నటించారు. కాని మాటలలో మాత్రం ఎక్కడా ప్రజలలో వ్యక్తం అవుతున్న సందేహాలకు అటు కాంగ్రెస్‌ లేదా టీడీపీ, రాహుల్‌ లేదా చంద్రబాబు ఎవరూ సమాధానం చెప్పకుండా దాటవేసి నటించడం ఈ సమావేశం విశిష్టతగా కనిపిస్తుంది. చంద్రబాబు తన ప్రసంగంలో కాంగ్రెస్‌తో కలవడం చారిత్రక అవసరం అని సమర్థించుకునే యత్నంచేశారు తప్పితే, రాహుల్‌గాంధీ మాత్రం అసలు ఆ ఊసే ఎత్తలేదు. చెప్పాలంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు, రాహుల్‌గాంధీ, చంద్రబాబునాయుడు ఒక అవకాశవాదంతో కలిశారన్న విషయం వారి మాటలలోనే అర్థం అవుతుంది. వారిద్దరూ పొడి, పొడిగానే ఎదుటివారి గురించి మాట్లాడారు తప్పితే, పూర్తిగా మనసుతో మాట్లాడినట్లు అనిపించలేదు. కాకపోతే చంద్రబాబు తన నటనా వైదుష్యంతో ప్రజాకూటమికి అనుకూలంగా మత్రం ప్రచారం చేశారు. గతంలో బండబూతులు తిట్టిన చంద్రబాబు చెంత కూర్చోవడానికి రాహుల్‌గాంధీకి పెద్దగా బాధ అనిపించలేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఏది ఏమైనా దుష్ట చంద్రబాబు పద్మవ్యూహంలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకున్నట్టే కనిపిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తమ జవసత్వాలు కోల్పోయి చంద్రబాబు ముందు తోక ఆడిస్తూ ఉండే పరిస్థితి ఏర్పడుతుంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:ఆంధ్ర ఆక్టోపస్ కి చంద్రబాబు ఎన్ని కోట్లిచ్చారో?

You might also like