Saakshyam
Nothing scared but the truth
Page Right

చూశారా ఈ విడ్డురం ఢిల్లీ లో మాత్రమే మొగుడూ పెళ్లాలట..ఇక్కడ కాదట..?

0

Chandrababu, Congress, Friendship,AP, TDP

2014 ఎన్నికల్లో ఒకవైపు బీజేపీతో మరోవైపు జనసేన తో పొత్తు పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ పై అధికారం చెలాయించారు, ఇక ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయాల నుడ్ని కాస్తా సైడ్ అయిపోయారు మళ్ళి సినీ ఇండస్ట్రీ ట్రాక్ ఎక్కేసారు, అతని గురించి కాసేపు పక్కన పెడితే గత నాలుగు సంవత్సరాల నుండి టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ తో కాపురం చేసుకుంటూ వచ్చింది ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నడిపించారు, కాని గత కొద్ది రోజులక్రితం టీడీపీ బీజేపీ ప్రభుత్వానికి విడాకులు ఇచ్చేసింది ఇక విడాకులు ఇచ్చింది కదా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేయవచ్చుగా కాని అలా చెయ్యడం లేదు మరో కొత్త పెళ్ళాం కోసం వెతుక్కుంటున్నాడు చంద్రబాబు. మొత్తానికి ఢిల్లీ వెళ్లి మరి ఒక కొత్త పెళ్ళాన్ని పట్టేసాడు. అది కూడా టీడీపీ కి పుట్టక నుండి యంటి అయిన కాంగ్రెస్ తో పొత్తు ని పెట్టుకున్నాడు అది చూసిన ఏపీ జనాలు నిర్ఘాంత పోయారు. బాబు ఏంటీ ఇలా చేస్తున్నాడు అసలు ఆలోచించే ఈ పని చేస్తున్నారా అని చర్చలు మొదలు పెట్టారు.

ఎట్టకేలకు కొత్త పెళ్ళాన్ని కలిసి అన్ని కుదుర్చుకొని వచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న కూడా చంద్రబాబు (Chandrababu) తన బుద్ది మాత్రం మార్చుకోవడం లేదు తాజాగా కాంగ్రెస్ పొత్తు పై మరోసారి నోరు జారారు టీడీపీ నేతలు కాంగ్రెస్ తో తమ పొత్తు కేవలం ఢిల్లీ వరకే అని అది ఆంధ్రప్రదేశ్ కాదు అని తమ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణాలో కూడా అదే మాట. కాంగ్రెస్, టీడీపీలు ఢిల్లీలో తెలంగాణలో మాత్రమే మొగుడూ పెళ్లాలు అని.. ఏపీలోకి వచ్చేసరికి వీరిద్దరికీ సంబంధం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై చంద్రబాబు మాట కూడా అలాగే ఉందట. ఢిల్లీ లో మాత్రమే కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అది ఏపీలోకి వచ్చేసరికి ఉండబోదని కాంగ్రెస్ మీద ఇక్కడ ఎదురుదాడి చేయాలని ఆయన స్పష్టంగా చెప్పాడట. అందుకే ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు నిన్నా మొన్న కూడా కాంగ్రెస్ ను విమర్శిస్తూ మాట్లాడారు.

గతంలో స్పీకర్ కోడెల, మంత్రి అయ్యన్నపాత్రుడు లాంటివాల్లందరూ కూడా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు అసలు రాష్ట్ర విభజన జరగడానికి కారణం కాంగ్రెస్, ఆ కాంగ్రెస్స్ పార్టీ వలన రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది ఇప్పుడు ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణం అని విమర్శలు చేశారు, రాహుల్ తో చంద్రబాబు నాయుడు సమావేశం అయిన తర్వాత కూడా వీళ్లు ఇలాగే మాట్లాడారు. కానీ బాబు మాత్రం ఎగరేసుకుంటూ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చేతులు కలిపి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఫోటోలకు పోజులిస్తూ రచ్చ రచ్చ చేసి వచ్చారు. మొత్తానికి బాబు తనేంటో మరొకసారి ఏపీ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. చివరిగా ఢిల్లీ వరకే తాము మొగుడు పెళ్ళాలమని, ఏపీ కి వచ్చే సరికి తమతో వారికీ సంబంధం లేదు అని, అక్రమ సంబంధం వైనాన్ని వారే వివరిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీతో ఎలా డీల్ చేయాలో ఏపీ కాంగ్రెస్ కు అర్థం అవుతున్నట్టుగా లేదు.

You might also like