Saakshyam
Nothing scared but the truth

15 వేల కోట్లు సిద్ధం చేసిన చంద్రబాబు

Chandrababu ready to spend 15000 Cr. in upcoming elections

0

Chandra Babu Distributing 15k Crores To Voters | Telugu Political News

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కో ఓటరుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు రూ.15 వేల కోట్లు సిద్ధం చేశారని(Chandra Babu Distributing 15k Crores To Voters) వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నోట్ల వర్షం కురిపించడానికి చంద్రబాబు రంగం సిద్ధం చేశారన్నారు. దేశ వ్యాప్తంగా పంచడం కోసం రూ.5 వేల కోట్లు ఇస్తానంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చంద్రబాబు ప్రామిస్‌ చేశాడని చెప్పారు. అలాగే తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున  రూ.1,200 కోట్ల వరకూ తరలించారని ఆరోపించారు. అలాగే రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం రూ.500 కోట్ల చొప్పున పంపించిన విషయం కూడా చాలామంది నాయకులకు తెలుసన్నారు.

లోకేశ్‌తో ఉన్న రాజేశ్, శ్రీనివాస్, మరో అజ్ఞాతవ్యక్తి గోపి, యరపతినేని శ్రీనివాసరావు, సుబ్బారావు వీళ్లంతా డబ్బులు ఎలా తరలించబోతున్నారో త్వరలోనే ప్రజలకు వివరిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు. దీనికి ఉన్నతాధికారులైన ఆర్పీ ఠాకూర్, ఏబీ వెంకటేశ్వరరావు, సతీశ్‌చంద్ర, సాయిప్రసాద్‌తో పాటు సీఎం పేషీలో పనిచేస్తున్న మరికొందరు అధికారులు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు.ఈ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానని, ఈసీకి కూడా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. దీన్ని సాకుగా చూపించి.. తనపై దాడులకు దిగినా బెదిరే ప్రసక్తే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

chandra babu distributing 15crores to voters || Telugu Politics || Saakshyam

విజయవాడలో నాలుగేళ్లుగా ఓ వంతెన కట్టలేని చంద్రబాబు.. హైదరాబాద్‌ను తానే నిర్మించానని, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టును తానే కట్టానంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు తమ మనస్సాక్షి ప్రకారం ఓట్లు వేయాలని.. టీడీపీని మాత్రం దగ్గరకు రానీయొద్దని పిలుపునిచ్చారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం వెనుక చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి, వెలగపూడి రామకృష్ణబాబు, ఠాకూర్, వెంకటేశ్వరరావుల పాత్ర లేకపోతే.. ఒక నిష్పాక్షిక సంస్థ ద్వారా దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదో చెప్పాలన్నారు. 2014 ఎన్నికలప్పుడు ప్యాకేజీ తీసుకుని కాల్షీట్లు ఇచ్చినట్టుగానే.. 2019 ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ అమ్ముడుపోతున్నాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:తెలంగాణ ప్రజలంటే లగడపాటి కి ఎందుకంత చిన్నచూపు? సర్వే ఎందుకు మార్చారు?

You might also like