Saakshyam
Nothing scared but the truth

కుపితులు అవుతున్న కాంగ్రెస్ నాయకులు 

Chandrababu Naidu meets Rahul Gandhi | Political News | Saakshyam

0

Ilapavuluri Murali Mohan Rao

Chandrababu Naidu meets Rahul Gandhi,Saakshyam Political News

మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని, రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోస్తున్నారు తెలుగుదేశం నాయకులు.  చంద్రబాబు రెండు తిడితే ఆయన భృత్యులు నాలుగు తిడుతున్నారు.  కాంగ్రెస్  పార్టీ పట్ల నరనరానా ద్వేషాన్ని నింపుకుని జన్మించిన పార్టీ తెలుగుదేశం.  1989  లో వీపీ సింగ్ ప్రధాని కావడానికి కారణం నాటి నందమూరి ప్రేరణతో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్.  ఆ తరువాత కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే ఎజెండాగా తెలుగుదేశం రాజకీయాలు నడిపింది. (Chandrababu Naidu meets Rahul Gandhi)

2014 లో బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ (Chandrababu Naidu meets Rahul Gandhi) కు వ్యతిరేకంగా విషప్రచారం చేసారు చంద్రబాబు.  దానికితోడు ఆంధ్రులు కూడా కాంగ్రెస్ పార్టీమీద కక్షకట్టి భూస్థాపితం చేశారు.  అలాంటి కాంగ్రెస్ పార్టీతో హఠాత్తుగా చంద్రబాబు నాయుడు చేతులు కలిపేశారు.  కాంగ్రెస్ తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆ పొత్తు జరగదు అనే నమ్మకంతో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలోని మంత్రులు ఉరి వేసుకుంటాము, జనం చెప్పులతో కొడతారు లాంటి ప్రకటనలు చేశారు.  ఈ వార్త రాసె సమయానికి సదరు మంత్రి ఉరి వేసుకోవడం జరగలేదు.  ఆయన నిజంగా ఉరి వేసుకుంటే మరో వ్యాసంలో సంతాపం తెలుపుదాము.

ఇక తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.  మూడున్నర దశాబ్దాలుగా ఎన్టీఆర్, చంద్రబాబు నామాలను జపిస్తూ ఓట్లు ఆడుకుంటున్న జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు ఇప్పుడు తమ ప్రత్యర్థులైన కాంగ్రెస్ నాయకులతో చెట్టపట్టాలు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. కలిసి ఎన్నికల ప్రచారాలు చేసుకోవాలి.  నిన్నటిదాకా చంద్రబాబును విమర్శించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చంద్రబాబు పేరును చెప్పుకుని ఓట్లను అర్ధించాలి.  ఇంతకన్నా, దుర్భరమైన పరిస్థితి మరెక్కడుంటుంది?

నలభై ఏళ్ల అనుభవం ఉన్నదని డప్పు కొట్టుకునే చంద్రబాబు ఎందుకు ఇంత హీనస్థితికి దిగజారిపోయాడు?  జగన్ అనే ఒక అరివీరభయంకరుని చూసి!  ఎన్ని కేసులు పెట్టినా చలించడం లేదు.  ఎన్నాళ్ళు గడిచినా ప్రజాదరణ తగ్గడం లేదు.  పైగా పాదయాత్ర తరువాత మధ్యందిన మార్తాండుడిలా అగ్నిశిఖలను కురిపిస్తున్నాడు.  ఒక్క జగన్ ను నిలువరించే వృధాప్రయాసతో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాల ముందు తాకట్టు పెట్టేసాడు చంద్రబాబు.

అయితే, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు-రాహుల్ Chandrababu Naidu meets Rahul Gandhi సంగమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లూ తాము విమర్శిస్తూ వస్తున్న చంద్రబాబుపై ఇక నోరు విప్పడానికి అవకాశం లేకపోవడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు.  సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, మరో సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సి రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  ఇరవైనాలుగు గంటల వ్యవధిలో ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీని వదలివెళ్లడం కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా ఆఘాతమే .  రాబోయే రోజుల్లో మరికొందరు పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయం.  అలాగే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరపరాయజం అనివార్యం అని గ్రహించిన తెలుగుదేశం నాయకులు కూడా త్వరలో ఈ సాకుతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి.  వీరికి గమ్యస్థానం  జనసేన లేదా వైసిపి అవుతుంది.  కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం కూడా రేపటి ఎన్నికల్లో భూస్థాపితం కావడం ఖాయం.

కథనం మరియు విశ్లేషకులు:
ఇలపావులూరి మురళీ మోహన రావు గారు

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Another : దుష్ట శక్తుల మీద సాధించిన విజయం ఇది – జగన్

You might also like