Saakshyam
Nothing scared but the truth

రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు: రోజా

Chandrababu left the regime in the state

0

Chandrababu left the regime in the state | telugu political news

తణుకులో లో ఏర్పాటు చేసిన వైస్సార్సీపీ మహిళా విభాగ సభకు వైస్సార్సీపీ మహిళా అధక్షురాలు, నగరి ఎమ్మెల్యే శ్రీమతి ఆర్కే రోజా హాజరయ్యారు. (Chandrababu left the regime in the state) రాష్ట్రంలో పాలనను చంద్రబాబు గాలికొదిలేసాడని ఆమె విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు కనీసం విభజన హామీలను తీసుకురాలేని చేతకాని ముఖ్యమంత్రిగా చరిత్రకు ఎక్కాడు. రాష్ట్రం లో చాలా సమస్యలు ఉన్నాయి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెప్పించుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యాడు. రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసి తెలంగాణాలో తిరుగుతూ అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ప్రజలందరు గమనిస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్ తో పెట్టుకున్న పొత్తును చూసి దేశంలో అందరూ చంద్రబాబు అంత విలువలు లేని ముఖ్యమంత్రి మరొకరు ఉండరని విమర్శిస్తున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి మనకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను దేశం నుండి తరిమికొట్టాలని చెప్పిన చంద్రబాబు ఇపుడు అదే కాంగ్రెస్ తో జత కలిసి తెలంగాణాలో ఎన్నికలకు వెళ్లాడంటే కాంగ్రెస్, టీడీపీని ఎక్కడిదాకా తరిమికొట్టాలో చంద్రబాబు చెప్పాలి.

Chandrababu left the regime in the state

రెండు సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ పై చెప్పులు వేసిన చంద్రబాబు ఇపుడు అదే చెప్పులు నెత్తిన పెట్టుకోవడం వెనక కారణం ఏంటి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ తో పెట్టుకోవడానికి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం, వ్యవస్థల్ని కాపాడడం, చారిత్రక అవసరం అంటూ చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్ వంటి వాటిని తీసుకురావడం చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి దేశాన్ని ఉద్ధరిస్తాడట.

Chandrababu left the regime in the state

 

ఈరోజు 21 మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొని, నలుగురికి మంత్రి పదువులిచ్చి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ఇవాళ వ్యవస్థల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు రాష్ట్రంలో కరువు తో అల్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, డ్వాక్రా మహిళలు చంద్రబాబు మాటలు నమ్మి అప్పులు చేసి బ్లాక్ లిస్ట్ లో ఉంటే, యువత నిరుద్యోగంతో అల్లాడుతుంటే వీటికి పరిష్కారం చూపకుండా ప్రత్యేక విమానాల్లో ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు కి ఆంధ్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like