Saakshyam
Nothing scared but the truth

కాంగ్రెస్ తో కలవడానికి సిగ్గుందా చంద్రబాబు?

Chandrababu don't you fell shame to align with Congress

0

Chandrababu don’t you fell shame to align with Congress | Telugu political news

చంద్రబాబునాయుడు అంతటి అవినీతి పరుడు ప్రపంచంలోనే లేడన్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో నిస్సిగ్గుగా టీడీపీతో కలిసి పని చేస్తోందని (Chandrababu don’t you fell shame to align with Congress) ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దామన్న చంద్రబాబు ప్రతిపాదనకు కేటీఆర్‌ తిరస్కరించగానే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడు తనం మరేదీ ఉండదన్నారు.

సోనియా గాంధీని అవినీతి అనకొండ అన్నాడు. రాష్ట్రాన్ని విడగొట్టిన సోనియా ఆ రోజు గాంధీని చంపిన గాడ్సే.. ఈ రోజు ఆమె దేవత! రాహుల్‌ లాంటి మొద్దబ్బాయ్‌ కూడా దేశాన్ని పరిపాలిస్తాడా? అని ఆరోజు చంద్రబాబు ప్రశ్నించాడు. మరి ఈ రోజు రాహుల్‌గాంధీ అంటే ఆహా… ఏం మేధావి! అని పొగుడుతున్నాడు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే పదాలకు చంద్రబాబు పాతరేశాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నిజంగా వీళ్ల రాజకీయాలు ఈ స్థాయికి దిగజారి పోయాయి. ఇదే కాంగ్రెస్‌ పార్టీ ఈ ఏడాది జూన్‌ 8న ఓ పుస్తకం విడుదల చేసింది. నాలుగేళ్ల చంద్రబాబు పాలన మీద, ఆయన అవినీతి మీద, దుష్ట పాలన మీద రాహుల్‌ గాంధీ బొమ్మతో, చార్జిషీటు అనే పేరుతో ఆ పుస్తకాన్ని విడుదల చేసింది. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని, ఇంతటి దుష్టపాలన ఎక్కడా ఉండదని ఆ పుస్తకంలో స్పష్టంగా చెప్పింది. అలాంటిది ఈ రోజు ఆ పార్టీలు నిస్సిగ్గుగా తెలంగాణ ఎన్నికల్లో ఒకే వేదిక మీద నిలబడ్డాయి. రాహుల్‌ పక్కన నిల్చొని చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిజంగా వీరికి సిగ్గూ ఎగ్గూ ఉందా?

కరువుతో రాష్ట్రం అల్లాడి పోతోంది. కరువొస్తే చంద్రబాబు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడు. రుణాలు రీషెడ్యూలింగ్‌ చేయడు. రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా పట్టించుకోడు. ఇంతటి దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉంటే ఈ పెద్దమనిషి ప్రతి రోజూ విమానం ఎక్కి బిల్డప్‌ ఇస్తాడు. అయ్యా.. చంద్రబాబూ! మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది రాష్ట్ర ప్రజలను పట్టించుకోమని. కానీ నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రజలను గాలికి వదలేసి ప్రధాన మంత్రి ని ఎలా దింపాలని తిరుగుతున్నావు.

Chandrababu don’t you fell shame to align with Congress | Telugu news

చంద్రబాబు నాలుగున్నరేళ్ల దుష్ట పరిపాలన, అధర్మం, అన్యాయం, అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్లుగా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా అక్కడ కనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్‌, అని ప్రతి ఒక్కరికీ తెలుసు. పవన్‌ కళ్యాణ్‌  నాలుగున్నరేళ్లుగా చంద్రబాబుకు పార్ట్‌నర్‌గా ఉన్నాడు. చంద్రబాబు ప్రభుత్వం మీద ఏదైనా మాట్లాడవయ్యా.. అంటే దాని గురించి తక్కువ మాట్లాడతాడు. కానీ జగన్‌ అవినీతిపరుడు అని అంటాడు. జగన్‌ అవినీతి పరుడు అంటున్నావే.. నువ్వేమైనా చూశావా పవన్‌ కళ్యాణ్‌? కార్లు మార్చినట్లు నలుగురు భార్యలను మార్చి వివాహ వ్యవస్థను వీధుల్లోకి తేవడం మగతనం అవుతుందా? అని పవన్‌ కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:దోచిన డబ్బుతో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

You might also like