Saakshyam
Nothing scared but the truth

కాంగ్రెస్‌ను ఓడించండి: చంద్రబాబు

Chandrababu appeals people to vanquish Congress

0

Chandrababu appeals people to vanquish Congress | Telugu political news

కాంగ్రెస్ ని ఓడించండి ఇదేదో మోడీ అన్న మాట కాదు, చంద్రబాబు అన్నమాట. గత 35 ఏళ్లుగా చెప్పిచెప్పి (Chandrababu appeals people to vanquish Congress) అలవాటైన మాట.. కాంగ్రెస్‌ను ఓడించండి.. తరమికొట్టండి అని.. కొన్ని వేల సభలో చెప్పి ఉంటారు. ఇప్పుడు ఉన్న పలానా ఆ మాట మార్చాలంటే.. ఆ నాలుక సహకరించాలి కదా!.. ఎంత జాగ్రత్తపడినా ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ఎంత దూరమైన వెళ్లడానికి సిద్దపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైగా ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జతకట్టి.. కాంగ్రెస్‌ పార్టీని తిట్టని తిట్టు తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. వారి పక్కనే నిల్చొని టీఆర్‌ఎస్‌, బీజేపీలను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు.

Chandrababu appeals people to vanquish Congress | Telugu news

తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా నందమూరి కుటుంబాన్ని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు.. కూకట్‌పల్లి టికెట్‌ను దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కేటాయించారు. తెలుగు మాట్లాడడమే సరిగా రాని సుహాసిని తనకు తానుగా ప్రచారం చేసుకోలేదు. అందుకే ఆమెను గెలిపించడానికి.. బావా, బామ్మర్ధులు తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గాల్లో రోడ్‌ షోలో పాల్గొంటూ.. సుహాసిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే శనివారం కూకట్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, మహాకూటమి నేతలంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే నాలుక కర్చుకున్న చంద్రబాబు బీజేపీ అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఆదివారం చేవేళ్ల ప్రజాశీర్వాద సభలో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:నీ అజ్ఞానం తో ప్రజల్లో అల్లకల్లోలం సృష్టిస్తావా పవన్ (నిత్య)కల్యాణా?

You might also like