Saakshyam
Nothing scared but the truth

మంచి సినిమాకి అవమానం: జాతీయ అవార్డ్స్ కి c/o కంచరపాలెం తిరస్కరణ

C/o Kancharapalem rejected for national awards | Telugu cinema news | Saakshyam

0

C/o Kancharapalem rejected for national awards | Telugu film news | Saakshyam

గత సంవత్సరం విడుదలైన కేరాఫ్ కంచరపాలెం సినిమా ఎన్ని ప్రశంశలందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్స్ లో ప్రేక్షకులు సైతం (C/o Kancharapalem rejected for national awards) సినిమా క్లైమాక్స్ లో లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. దీన్ని బట్టి చుస్తే అర్థమవుతుంది దర్శకుడు కృషి. కంచరపాలెం, అక్కడి మనుషుల స్వచ్ఛతను దర్శకుడు యథాతదంగా తెర మీద చూపించగలిగాడు. అందుకే సామాన్య ప్రేక్షకుడు సైతం అంతలా కనెక్ట్ అయ్యారు సినిమాకు. ఈ సినిమాలో పాత్రల కోసం దాదాపు అందరు నటీనటులను కంచరపాలెం నుండే తీసుకున్నాడు దర్శకుడు. అందులోను ఇద్దరు, ముగ్గురు మినహా ఎవ్వరికీ నటనలో అనుభవం కానీ, నటన గురించిన అవగాహన కానీ లేదు ఇక్కడ దర్శకుడి గట్స్ ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక నిర్మాత ప్రవీణ పరుచూరి విషయానికి వస్తే, సినిమాల మీద ప్యాషన్ ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్, అక్కడి వృత్తిని వదులుకొని మరి ఇండియాకి వచ్చి ఈ సినిమా నిర్మించారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఒక వేశ్య పాత్ర కూడా పోషించింది.  కథా, కథనం పరంగానే కాకుండా సాంకేతికంగా కూడా ఇందులో ప్రయోగాలు చేసాడు దర్శకుడు, చాలా అడ్డంకులను దాటుకొని సింక్ సౌండ్ టెక్నాలజీతో మంచి అవుట్ ఫుట్ ఇవ్వగలిగారు. ఈ సినిమా చూసి ఫిదా అయిన నిర్మాత సురేష్ బాబు కూడా చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసారు.

 

C/o Kancharapalem rejected for national awards | Telugu film updates | Saakshyam

విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ సినిమాకు కచ్చితంగా నేషనల్ అవార్డ్స్ వస్తాయని భావించారు, అయితే ఆ విషయంలో చిత్రానికి నిరాశే మిగిలింది. ఈ సినిమాను కనీసం నేషనల్ అవార్డ్స్ కు నామినేట్ కూడా చేయలేదు, నిబంధనలు కారణంగా చూపి కంచరపాలెం ను తిరస్కరించింది అవార్డ్స్ కమిటీ.  నిర్మాత పరుచూరి ప్రవీణ పుట్టుకతో భారతీయురాలే అయినా అమెరికన్ పౌరురాలు కావడంతో జాతీయ అవార్డుల పోటీకి ‘కేరాఫ్ కంచరపాలెం’ను పరిగణించలేదు. ఇది సినిమా ప్రేమికులను నిరాశపరిచే అంశం. సరే, కేరాఫ్ కంచరపాలెం సినిమా ప్రయాణమే గొప్పగా ఉంది. ‘‘నేను మిమ్మల్ని నిరాశపరిచాను. క్షమించండి’’ అంటూ పరుచూరి ప్రవీణ ట్విటర్ ద్వారా స్పందించారు. దీనికి దర్శకుడు మహా వెంకటేశ్ స్పందిస్తూ.. ‘‘మీ తప్పేమీ లేదు. దేశంలో ఉన్న బూజుపట్టిన నిబంధనలు. భారతీయ నటులు, భారతీయ దర్శకుడు, ఇక్కడి వారికోసం చేసిన సినిమా అవార్డులకు పరిగణించకపోవడం దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మార్పు రావాలి ఇప్పటికైనా అంటూ దర్శకుడు వెంకటేశ్ కేంద్ర ప్రభుత్వపు ఫిలిం ఫెస్టివల్స్ సంచాలకునికి కూడా తన ట్వీట్ ను టాగ్ చేశారు.  ఒక మంచి సినిమాకు అవార్డు ఇచ్చేందుకు నిబంధనలు అడ్డు వచ్చినప్పుడు మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు ఎందుకు అని నిలదీశారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like