Saakshyam
Nothing scared but the truth

ఆ విషయంలో దేవినేని ఉమా కి సవాల్ విసిరిన బొత్స…!!

0

Botsa Satyanarayana Sawal, Devineni Uma, Jagan

విజయనగరం జిల్లాలో జగన్ బహిరంగ సభ జరుగుతున్నా సమయంలో అంబులెన్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే అయితే సభ మధ్యలో అంబులెన్స్ రావడం పై మీడియాలో అలాగే సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలామంది నేతలు స్పందించారు. అసలు ఆ అంబులెన్స్ లో పేషంట్స్ ఎవరు లేరని, ఇవన్ని ప్రభుత్వ వికృత చర్యలంటూ జగన్ విమర్శించారు. అయితే ఈ విషయంపై దేవినేని ఉమా స్పందించి ఆ అంబులెన్స్ లో వైసీపీ నేత ఉన్నారు అని ఈరోజు ఉదయం అయన తెలిపారు,

మరికొంతమంది అసలు ఆ అంబులెన్స్ లో ఎవరు లేరని కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో తాజాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (Satyanarayana) స్పందించారు. ఆ 108 అంబులెన్స్ లో గాయపడ్డ వైసీపీ నేత ఉన్నారు అని ఉమా అంటున్నారే అసలు ఆ విషయాన్నీ అయన నిరూపిస్తారా? అని సవాల్ విసిరారు. ఆ అంబులెన్స్ ను తాను తనిఖీ చేశానని, అందులోని డ్రైవర్ తో మాట్లాడానని అన్నారు. అందులో రోగులెవ్వరూ లేరని బొత్స చెప్పారు. కానీ జగన్ పైన ఎదో చెయ్యాలని కొంతమంది నేతలు ఇలా కామెంట్స్ చేస్తున్నట్లు అర్ధమౌతుంది. చూద్దాం ఈ విషయం ఎక్కడివరకు వెళ్తుందో. మరి ఈ వ్విశాయంపై జగన్ స్పందిస్తారో లేదో చూద్దాం…

You might also like