Saakshyam
Nothing scared but the truth

డామిడ్ కధ అడ్డం తిరిగింది దెబ్బతో షో ఆగిపోయింది…!

0

Pradeep, Pelli chupalu show, Suma

ఎదో అడ్డదిడ్డమైన పనికిరాని సీరియల్స్ చూస్తూ కాలం గడిపెస్తున్నారులే అనుకుంటే అది పొరపాటే బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యకూడదు. అసలు బుల్లితెరపైన సీరియల్స్ కానివ్వండి, రియాల్టీ షోస్ కానివ్వండి ఏదైనా నడుస్తున్నాయి అంటే దానికి కారణం బులితెర ప్రేక్షకులే అన్నమాట ఎవ్వరు కూడా మర్చిపోకూడదు మరిచిపోతే ఇలాగె డ్యామేజ్ జరుగుతుంది షో మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టయాల్సి వస్తుంది. సరిగ్గా ఇప్పుడు సుమ, యాంకర్ ప్రదీప్ (Pradeep) చేస్తున్న పెల్లిచుపుల షోలో అదే జరిగింది. మనం ఏది చేసిన పిచ్చి జనాలు చూస్తారులే మనల్ని ఆకాశానికి ఎత్తుటార్లె అనుకున్నారు చివరికి బొక్క బోర్ల పడ్డారు. మొన్న ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ అనే రియాల్టి షో ఒకటి బుల్లితెరపియన్ ప్రసరంయ్యింది అయితే ఆ షో కి సీజన్ 1 కి వచ్చినంత రేటింగ్ రాకపోయే సరికి ఆ వెలితిని పెళ్ళిచూపులు అనే షో ద్వారా పూడ్చాలి అని ఎత్తులు వేసింది మా మజమన్యం కాని చివరికి ఆ ప్లాన్ మొత్తం కూడా బిసి కొట్టింది. ఒకవైపు సామాన్య ప్రజలు ఛీ కొడుతుంటే మరోవైపు బుల్లితెర ప్రేక్షకులు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు.

బుల్లితెరపైన మెల్ యాంకర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ అయితే ఈ షో కి మంచి టీఅర్పి వస్తుందని భావించి అతనికి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు కాని అది కూడా కలిసిరాలేదు పెళ్లి చూపులు అంటూ మొదలు పెట్టి సాంప్రదాయాలను మంటగాలుపుతున్నారు అంటూ ఆడవాళ్లకు మర్యాద దక్కడం లేదు అంటూ ప్రదీప్ పైన క్రిమినల్ కేసు పెట్టాలి అని మహిళలు ధర్నాలు చేస్తున్నారు, అంతకుమించి షో అద్దంతరంగా అపెయ్యకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అని హెచ్చరించారు. దాంతో ఈ షో ని ఆపెయ్యాలి అని భావించినట్లు తెలుస్తుంది మహా అయితే ఈ వారం చివరిలో షో కి ఎండ్ కార్డ్ పడనున్నట్లు తెలుస్తుంది. యాంకర్ సుమ సైతం తన కెరీర్ లో మొదటిసారి ట్రాలింగ్ కు గురయ్యింది. ఇలాంటి షోకు యాంకరింగ్ చేసేముందు కనీసం ఇది తప్పా కదా అన్న ఆలోచన కూడా రాలేదాని నిలదీసిన వాళ్ళే ఎక్కువ. ఒప్పందం కాబట్టి అప్పటికప్పుడు సుమ అయిన వెనక్కు రాలేని పరిస్థితి.

మొత్తానికి ఈ షో కి 60 కోట్ల వరకు నష్టం కలిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కాని ఇన్సైడ్ టాక్ అయితే 60 కాదులేకాని ఒక 25 ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ షో కి భారీగా సెట్ వేసి ఇద్దరు యాంకర్స్ ని పెట్టి షో కి వచ్చిన పార్టిసిపెంట్స్ తాలూకు ఖర్చులు కానివ్వండి మొత్తం చూసుకుంటే అంత వరకు నష్టం జరుగుతుందని తెలుస్తుంది. అంతకుమించి ప్రదీప్ బుల్లితెరపైన ఇప్పటివరకు సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి చివరికి నవ్వుల పాలవ్వక తప్పలేదు. దినంతటికి కారణం సెట్ లో అమ్మాయిలు చేసిన ఓవర్ యాక్షన్ అనే తెలుస్తుంది ఎందుకంటే వచ్చిన అమ్మాయిలందరూ కూడా ప్రదీప్ చెయ్యి తాకితే చాలు జన్మ ధన్యం అన్నంత రేంజ్ లో రెచ్చిపోయారు. ఇక్కడ తెలుసుకోవలసినది ఇంకొకటి కూడా ఉంది అదేమిటంటే యాంకర్ కు ఇమేజ్ ఉంది కదా అని సంప్రదాయాలను తుంగలో తొక్కే ఇలాంటి వాటికి స్వస్తి పలకకపోతే రేటింగ్ సంగతి దేవుడెరుగు హేటింగ్ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రదీప్ ఎదుర్కుంటున్నాడు.

Click here : మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయిన తేజ్ ప్రసాద్ యాదవ్ వివాహం ..!!

You might also like