Saakshyam
Nothing scared but the truth

మమత కు షాక్.. ఇద్దరు ఎంపీలు రాజీనామా, బీజేపీలోకి!

Big blow for Mamata Benerjee as two sitting MPs quits party | National news | Saakshyam

0

Big blow for Mamata Benerjee as two sitting MPs quits party | Telugu news | Saakshyam

సాధారణ ఎన్నికలకు ముందు తృణ‌మూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు రాజీనామా (Big blow for Mamata Benerjee as two sitting MPs quits party) చేశారు. బిష్ణుపూర్ ఎంపీ, టీఎంసీ నేత సౌమిత్ర ఖాన్ బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. అలాగే టీఎంసీకి రాజీనామా చేసిన బోల్పూర్ ఎంపీ అనుపమ్ హజ్రా సైతం బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కనీసం ఆరుగురు టీఎంసీ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని, వీరంతా పార్టీలో చేరుతారంటూ బెంగాల్ బీజేపీ నేత పేర్కొన్నారు. ఎంపీలు అర్పితా ఘోస్, శతాబ్దీ రాయ్‌లు సైతం పార్టీ వీడుతారనే ప్రచారం సాగుతోంది. అయితే, ప్రస్తుతం పార్టీకి రాజీనామా చేసిన నేతలంతా గతంలో టీఎంసీలో కీలకంగా ఉండి బీజేపీలో చేరిన ముకుల్ రాయ్‌కు సన్నిహితులని తృణ‌మూల్‌ వర్గాలు వ్యాఖ్యానించాయి. మోదీకి వ్యతిరేక పార్టీలతో కలిసి జనవరి 19న మమత బెనర్జీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించనుండగా, దీనికి పది రోజుల ముందే ఆమెకు షాక్ తగిలింది. మరోవైపు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఖాన్, హజ్రాలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీఎంసీ ప్రకటించింది. గత వర్షకాల సమావేశాల నుంచే ఈ ఎంపీలు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగడంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో వీరికి టిక్కెట్లు కేటాయించరాదని మమత నిర్ణయించారు. దీంతో వీరు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు.

 

Big blow for Mamata Benerjee as two sitting MPs quits party | National news | Saakshyam

టీఎంసీ అధినేత్రిపై పార్టీ నుంచి బయటకొచ్చిన సౌమిత్ర ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ దీర్ఘకాలం మనుగడ సాగించలేదని, అది మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్‌‌ల ప్రయివేటు సంస్థలా మారిపోయిందని ధ్వజమెత్తారు. అంతేకాదు, బెంగాల్‌లో సిండికేట్, పోలీస్ రాజా వ్యవస్థ నడుస్తోందని ధ్వజమెత్తారు. మమత నియంతలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎంపీ సౌమిత్ర ఖాన్ టీఎంసీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయనపై బంకురా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఆయన అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు. అంతకు ముందు రోజే ఎంపీ సహాయకుడు సుశాంత్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాన్ చేరికతో బెంగాల్‌లో తమ బలం మరింత పెరిగిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో సౌమిత్రి ఖాన్ బీజేపీ తరఫున బిష్ణుపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like