Saakshyam
Nothing scared but the truth

టీడీపీకి మంత్రి అఖిల ప్రియ గుడ్ బై?

Bhuma Akhila Priya may quits Telugu Desham | Telugu political news | Saakshyam

0

Bhuma Akhila Priya may quits Telugu Desham | Telugu political news | Saakshyam

కర్నూలు జిల్లాలో ఇప్పుడు అధికార టీడీపీలో కొత్త రచ్చ మొదలయ్యింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ టీడీపీ ని వీడే (Bhuma Akhila Priya may quits Telugu Desham) సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు తల్లి మరణంతో, అనుకోకుండా ఎమ్మెల్యేగా పిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, తండ్రి భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఏకంగా మంత్రి పదవినే చేపట్టింది. భూమా మరణంతో నంద్యాల ఎమ్మెల్యేగా భూమా సోదరుడి కుమారుడు బ్రహ్మానంద రెడ్డి కూడా పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయిపోయారు. అయితే టీడీపీలో గ్రూపు రాజకీయాల కారణంగా ఇప్పుడు భూమా అఖిల ఏకంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికే ఝలక్కిచ్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు ఎక్కడ లేని ఆసక్తిని కలిగిస్తున్నాయి. అఖిల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక నంద్యాలలో భూమా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి దాదాపుగా తిరుగుబాటు చేసినంత పనిచేశారు. అయితే చంద్రబాబు జోక్యం చేసుకుని, సుబ్బారెడ్డి, అఖిలను పిలిచి సయోధ్య కుదిర్చారు. అయితే ఈ సయోధ్య ఎంతో కాలం నిలవలేదు. అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య మళ్ళీ విభేదాలు తలెత్తాయి. ఇద్దరి మధ్య ఇప్పటికీ మాటలు లేవు.

 

ఈ క్రమంలోనే గత వారం భూమా అఖిల ప్రియ అనుచరుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు జరిగాయి. అంతేకాకుండా అఖిల ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ తెలుగు తమ్ముడి పై పోలీసులు ఏకంగా పీడీ యాక్టు కింద కేసు పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న అఖిల, తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ ను వెనక్కు పంపేశారు. సివిల్ పోలీసుల భద్రత కూడా అవసరం లేదని  అఖిల, జన్మభూమి కార్యక్రమాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లాకు వస్తే, ఆ కార్యమక్రమాలకు అఖిల పూర్తిగా దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో కర్నూలు వెళ్లిన డిప్యూటీ సీఎం హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ వివాదంలో అఖిలదే తప్పన్నట్లుగా మాట్లాడారు. దీనితో అఖిల ప్రియ మరింత ఆగ్రహించి, ఇక టీడీపీ లో ఉంటె లాభం లేదనుకునే నిర్ణయానికి వచ్చిందట. బయటకు తాను టీడీపీని వీడేది లేదని చెబుతూనే, సైలెంట్ గానే తన భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

 

Bhuma Akhila Priya may quits Telugu Desham | Telugu political news | Saakshyam

అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ ఆమె ఏ పార్టీలోకి వెళతారనే కొత్త చర్చకు ఇప్పుడు తెర లేసింది. వాస్తవంగా ఆళ్లగడ్డ నుంచి అఖిల ఎమ్మెల్యేగా ఎన్నికైంది వైసీపీ నుంచే. అయితే ఆ తర్వాత బాబు విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయిన భూమా నాగిరెడ్డి అఖిలతో కలిసి టీడీపీలోకి జంపయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోవడం అఖిల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అఖిల తిరిగి వైసీపీలోకే చేరతారా? లేదంటే గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో చేరినట్టుగా అఖిల జనసేనలోకి చేరతారా? అన్న కోణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖిల టీడీపీని వీడనున్నారన్న పుకార్లు ఇప్పుడు రాయలసీమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాయి. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్న నేపథ్యంలో అఖిల టీడీపీని వీడితే, అది ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like