Saakshyam
Nothing scared but the truth
Page Right

ఆర్టీజిఎస్ తో ప్రజలను విసిగిస్తున్న టిడిపి గవర్నమెంట్…?

AP People Upset With RTGS || Latest Political News

0

AP People Upset With RTGS || Saakshyam Political News

రాష్ట్రంలో తెలుగు దేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమాల కన్నా తమ ప్రభుత్వం ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థం అవుతోంది. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంతో పాటు వాటిని అర్హులకు అందజేసేలా అధికారులకు తగు ఆదేశాలు అందిస్తారు.కానీ టిడిపి గవర్నమెంట్ మాత్రం తమ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల నుండి స్పందన తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీజిఎస్ (రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ) ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు (AP People Upset With RTGS) వాయిస్ తో వచ్చే ఈ ఫోన్ కాల్ లో ప్రభుత్వ పాలనతో సంతృప్తిగా ఉన్నారా ? లేరా ? ఉంటె 1 నొక్కండి, లేదండి 2 నొక్కండి అని అడుగుతున్నారు.

ఇలా జిల్లాలో వేలాది ఫోన్ కాల్స్ వస్తున్నాయి. కొంతమంది ప్రజలు తమకు సంతృప్తి లేదని 1 నొక్కారు. దీంతో వెంటనే వారికి ఎందుకు లేదు ? అసలు కారణం ఏంటి ? అంటూ ఫోన్ లో వేధిస్తూ ఉన్నారట. ఇలా ఫోన్ కాల్స్ తో విసుగు చెందుతున్న ప్రజలు మనకెందుకు ఈ తలనొప్పి అంటూ 1 ప్రెస్ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

AP People Upset With RTGS | Telugu Political News | రాజకీయ వార్తలు

ఇలా ప్రతి ఒక్కరిచేత 1 నొక్కించి తమ పాలన బాగుందని బలవంతంగా చెప్పించేందుకు జనాల్ని విసిగిస్తూ ఉన్నారని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా కొంతమందిని అనవసర విషయాలపై ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం వేధింపుల వల్ల మనకెందుకు వచ్చిన తంటాలు అని అందరూ 1 నొక్కేస్తున్నారు. కానీ పెద్దలు మాత్రం తమ ప్రభుత్వం పై 70 – 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవ సర్వేలో మాత్రం టిడిపి అధికారుల ఫోన్ కాల్స్ ఒత్తిడి వల్లే తాము సంతృప్తిగా ఉన్నామని చెప్పాల్సి వస్తుందని ప్రజలు తెలుపుతున్నారు. ఇలా ప్రజలను ఇబ్బందులు పెట్టి అడ్డదారుల్లో ఒప్పించడం కన్నా వారి సంక్షేమాన్ని పట్టించుకుంటే వారే స్వయంగా ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema News and many more.

Read Here : చూశారా ఈ విడ్డురం ఢిల్లీ లో మాత్రమే మొగుడూ పెళ్లాలట..ఇక్కడ కాదట..?

 

You might also like