Saakshyam
Nothing scared but the truth

గుంటూరు లో మరో టీడీపీ వికెట్ డౌన్?

Another TDP mla ready to quit party

0

Another TDP mla ready to quit party | Telugu political news

ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. 2019 అసెంబ్లీ (Another TDP mla ready to quit party) ఎన్నిల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వ‌డంతో.. మ‌రోసారి అధికార‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్న టీడీపీ వ‌రుస‌గా ఊహించ‌ని షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీకి గుడ్‌బై చెప్పి, జ‌న‌సేన‌లో చేరిపాయారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. అయితే ఇప్పుడు తాజాగా మ‌రో టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీను వీడ‌నున్నార‌ని చర్చ నడుస్తుంది.

గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తాజాగా గుర‌జాల‌లో వైసీపీ అభ్య‌ర్థి కాసు మ‌హేష్ రెడ్డిని గెలిపించాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీంతో త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీని వీడ‌నున్నార‌ని ప్ర‌చారం మొద‌లైంది. రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన మోదుగుల ప‌రిస్థితి, ప్ర‌స్తుతం టీడీపీలో బాగ‌లేద‌ని తెలుస్తోంది. ఆయన మంత్రి పదవి ఆశించారు, ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో తీవ్రంగా అసంతృప్తి చెందిన మోదుగుల‌, టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

Another TDP mla ready to quit party | Telugu political updates

ఇక అప్ప‌టి నుండి పార్టీ మార‌తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నా, తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీలో రెడ్ల‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేద‌ని, గుర‌జాల‌లో మ‌న‌వాడినే(కాసు మ‌హేష్ రెడ్డి) గెలిపించాలంటూ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. మ‌రి మోదుగుల వైసీపీలో వస్తే ఆయ‌న ఎక్క‌డ నుండి పోటీ చేస్తాడో అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆశ‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఏది ఏమైనా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఇప్ప‌టికే రావెల టీడీపీకి గుడ్‌బై చెప్ప‌గా, ఇప్పుడు మోదుగుల కూడా టీడీపీని వీడితే చంద్ర‌బాబు గ‌ట్టి దెబ్బే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

Click here:ఏపీ లో చెప్పేంత దైర్యముందా బాబు

You might also like