Saakshyam
Nothing scared but the truth
Page Right

డైలాగ్స్ తో కేక పుట్టిస్తున్న మాస్ మాహారాజ్

0

Ravi Teja, Amar Akbar Antony, Trailer,

మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), శ్రీను వైట్ల కాంబో లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అమర్ అక్బర్ అంటోనీ’. తొలిసారి రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం కాగా చాలా కాలం గ్యాప్ తరువాత సరికొత్త లుక్స్ తో మరోసారి ఆయనతో జోడిగా నటిస్తున్నది ఇలియానా. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు.

 

‘ముగింపు రాసుకున్న తరువాతే కథను మొదలు పెట్టాలి ‘ అంటూ స్టార్ట్ అయ్యే టీజర్ లో రవితేజ మరోసారి తన డైలాగ్స్ తో కేకలు పుట్టిస్తున్నాడు. ‘‘ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మనచుట్టూ ఉన్న బలగం కాదు.. మనలో ఉన్న బలం’ అని రవి చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తుండగా, ‘వాడు ఎక్కడ ఉంటాడో.. ఎలా ఉంటాడో.. ఎలా వస్తాడో.. ఎవరికీ తెలీదు..’ అంటూ ప్రతి నాయకుడి మాటలు ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ‘రిలాక్స్’ అంటూ హీరో చెప్పే మాటలు కొంత హాస్యాన్ని పండిస్తోంది. నవంబర్ 16న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

You might also like