Saakshyam
Nothing scared but the truth

అమర్ అక్బర్ ఆంటోనీ ” రివ్యూ & రేటింగ్ “

Amar Akbar Anthony Review And Rating || Telugu Movie News || Saakshyam

0

Amar Akbar Anthony Review And Rating || Telugu Film News || Saakshyam

మాస్ మహారాజ్ రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన దుబాయ్ శ్రీను, వెంకీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించాయి. ఈ ఇద్దరూ తమ సినిమాల్లో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగో చిత్రమే ‘అమర్ అక్బర్ ఆంథోనీ'(Amar Akbar Anthony Review And Rating). అంతేగాక చాలా కాలం తరువాత ఇలియానా తెలుగులో చేసిన చిత్రం కాబట్టి సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమాలో రవితేజ, శ్రీను వైట్ల ప్రేక్షకులను ఏమేర నవ్వించారో చూద్దాం.

Raviteja | saakshyam.comకథ : అమెరికాలో స్థిరపడ్డ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి వ్యాపారం చేస్తుంటారు. వారితో పాటు కంపెనీలో పనిచేసే నలుగురిని కూడా భాగస్వాములుగా చేర్చుకుంటారు. అయితే వారు ఏకంగా సంస్థనే కాజేయాలని భావించి ఆ రెండు కుటుంబాలకు చెందిన అందరినీ చంపేస్తారు. కానీ అమర్ (రవితేజ), ఐశ్వర్య (ఇలియానా ) మాత్రం ఎలాగోలా తప్పించుకుని బయటపడతారు. ఇద్దరూ చెరో దిక్కుకు వెళ్లినా తమ వారిని చంపినా వారిపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మరి వారిపై ఈ ఇద్దరూ ఎలా పగ తీర్చుకున్నారు? అమర్, అక్బర్, ఆంటోనీ ల మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే.

Amar Akbar Anthony Review And Rating || Tollywood News || Saakshyam

విశ్లేషణ : ఆగడు, మిస్టర్ వంటి డిజాస్టర్ ల తరువాత తన ఫేవరెట్ హీరో రవితేజతో కలిసి శ్రీను వైట్ల రూపొందించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సహజంగా ఆసక్తినెలకొంది. సినిమా మొత్తం ప్రతీకారం కథ మీదే ఆధారపడి ఉంటుంది. డిసోసియేటివ్ ఐడెంటిటీ అనే రుగ్మతను హీరోకి జత చేసిన డైరెక్టర్ శ్రీను వైట్ల పెద్ద ప్రయోగమే చేశారు. ఉన్నట్టుండి తానూ చూసిన వ్యక్తుల్లా మారిపోవడం తిరిగి మామూలు స్థితికి రావడం ఈ రుగ్మత లక్షణం. సినిమా మొత్తంలో తోలి భాగంలో అమర్, అక్బర్, ఆంటోనీ గా రవితేజ అల్లరి, హోల్ ఆంధ్ర తెలుగు అసోసియేషన్ నిర్వాహకులుగా వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, గిరి, రఘుబాబు చేసే హంగామాతో సరదాగా సాగిపోతుంది.

ileana | saakshyam.com
ఇక ద్వితీయార్థంలో సునీల్ ఎంట్రీతో కథ ఆసక్తిగా సాగిపోతుంది. అక్కడక్కడా కామెడీ లో పంచ్ లు అంతలా పేలినట్లు అనిపించవు. చాలా రోజుల తరువాత మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో సక్సెస్ వస్తుందని ఆశించినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేవని చెప్పవచ్చు. ఒక కోణంలో చూస్తే రవితేజ త్రిపాత్రాభినయం కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు కొంతమేర గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఎవరు అమర్, ఎవరు అక్బర్, ఎవరు ఆంటోనీ అనే విషయం అర్థం కాకుండా ఉంటుంది అనిపిస్తోంది. పగ, ప్రతీకారం అనే వాటికి న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ జతచేసిన దర్శకుడు తయారు చేసిన కథనం ఆసక్తిగా అనిపించదు. నిర్మాతలు మాత్రం ఖర్చుకి వెనుకాడకుండా సినిమాని రిచ్ లుక్ వచ్చేలా చేశారు. ఇక తమన్ సంగీతం ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 2.5/5

Saakshyam comes with Telugu Political News, Telugu News, Latest Telugu News, telugu news live, Telugu News Headlines, Latest Telugu Breaking News , Political News, Crime News, sports news, Cinema News, Latest Cinema Updates,Telugu Cinema News,Election News,Telangana News, ,Telugu Film News  and Many More.

Read Another : రవితేజ అసలేంటీ ఈ డేషిషన్…?

You might also like