Saakshyam
Nothing scared but the truth

ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం

Alok Verma resigns from services | Telugu news | Saakshyam

0

Alok Verma resigns from services | National news | Saakshyam

సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం (Alok Verma resigns from services) తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Alok Verma resigns from services | Telugu news | Saakshyam

తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా, ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవీ విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపారు. అలాగే, ఆలోక్‌ ఇటీవల ఏడుగురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా నియమితులైన తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు రద్దుచేశారు. ఆ ఏడుగురు అధికారులు తిరిగి తమ తమ స్థానాల్లో కొనసాగాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన ఆలోక్‌ తన పట్ల కేంద్రం అవమానకరంగా వ్యవహరించిందని పేర్కొంటూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనవని వర్మ తెలిపారు. వాస్తవానికి వర్మ పదవీ కాలం జనవరి 31తో ముగియనుంది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

You might also like