Saakshyam
Nothing scared but the truth

అలోక్ వర్మ పై వేటు

Alok Verma removed as CBI chief | National news | Saakshyam

0

Alok Verma removed as CBI chief | Telugu news | Saakshyam

ఆలోక్‌ వర్మపై కేంద్ర ప్రభుత్వం వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా (Alok Verma removed from CBI chief post) సీబీఐ చీఫ్‌ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్‌ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్‌ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. వర్మను సీబీఐ నుంచి ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కేంద్రం బదిలీ చేసింది.

 

ఆలోక్‌ వర్మ, సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ఆలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్‌పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు ఆయన్ను డైరెక్టర్‌గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్‌కే సిన్హాను 2018 అక్టోబర్‌ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్‌రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్‌ ఆదేశాలిచ్చారు.

 

Alok Verma removed from CBI chief post | National news | Saakshyam

ఆలోక్‌ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ తరఫున జస్టిస్‌ ఏకే సిక్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్‌ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్‌ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం, సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ హోం గార్డ్స్‌ విభాగంలోని ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఆలోక్‌ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Saakshyam comes with Telugu Political News, Telugu News Headlines, Telugu Breaking News, Sports News, Latest Cinema,Election News,Telangana News,Telugu News  and Many More.

 

You might also like