Saakshyam
Nothing scared but the truth

ముసలి పాత్రలో కనిపిస్తే మార్కెట్ డ్యామేజ్ అవుతుంది: సమంత

Akkineni Samantha Rejected Nandini Reddy Movie || Telugu Movie News || Saakshyam

0

Akkineni Samantha Rejected Nandini Reddy Movie || Telugu Film News || Saakshyam

ఎవరైనా సరే పెళ్ళికి ముందు ఎలా ఉన్న కూడా పెళ్లి తరువాత జనాలకు ఒక మంచి మనిషిగా పరిచయం అవ్వాలనే కోరుకుంటారు. అక్కినేని సమంత ( Akkineni Samantha Rejected Nandini Reddy Movie ) కూడా ఆలాగే అనుకున్నట్లు ఉంది అందుకే పెళ్లి తరువాత ఒక హీరోయిన్ లాగా కాకుండా ఒక మంచి నటిగా అభిమానులకు దగ్గరౌతుంది. పెళ్ళికి ముందు స్టార్ హీరోస్ అందరి సరసన నటించిన సామ్ పెళ్లి తరువాత మంచి మంచి పాత్రలను పోషిస్తూ తనకు జీవితంలో గుర్తుండిపోయేలా క్రేజ్ ని సంపాదించుకుంటుంది. తను నటించబోయే సినిమా ఏది కూడా తన ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా చెయ్యకూడదని ఆచితుచి ఆలోచనలు చేసి సినిమాలకు సైన్ చేస్తుంది సామ్. పెళ్లి తరువాత సామ్ చేసిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బస్టర్ టాక్ నే అందుకున్నాయి అంతకుమించి సామ్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

దాంతో ఇకపైన సామ్ అలాంటి పాత్రలను మాత్రమే చేయ్యలని నిర్ణయం తీసుకుంది. అందుకే శివ దర్శకత్వంలో చైతు సరసన ఒక మంచి భార్య గా పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సెర వేగంగా జరుగుతుంది అతి త్వరలోనే ప్రేక్షకుల ముందు రానున్నది. ఈ సంగతి ఇలా ఉంటె తాజాగా సామ్ కి మరొక సినిమా చాన్స్ వచ్చింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక తమిళ్ రీమేక్ సినిమాని చేస్తుంది. అయితే ఈ సినిమాలో ఒక 70 ఏళ్ల ముసలమ్మా లాగా అలాగే 20 ఏళ్ల భామలా సమంత ద్విపాత్రాభినయం చేయనుందని టాక్ వచ్చింది.

Akkineni Samantha Rejected Nandini Reddy Movie || Tollywood News || Saakshyam

ఇది నిజమే అయినప్పటికీ సమంత ఇప్పుడు మనసు మార్చుకుంది. ముసలి పాత్రలో కనిపిస్తే మార్కెట్ డ్యామేజ్ అనుకుందో ఏమో గాని చివరికి ఆ పాత్రకు మొదలవ్వకముందే ఎండ్ కార్డ్ పెట్టేసింది. ఈ సినిమాలో ఆ గెటప్ వేసి మంచి మైలేజ్ సొంతం చేసుకోవచ్చులేగాని సామ్ మాత్రం రిస్క్ ఎందుకోలె అనుకుంటుంది అందుకే ఆ గెటప్ ని పక్కన పెట్టేసింది. సక్సస్ బాటలో ఉన్నప్పుడు ప్రయోగాలూ చేసి రిస్క్ చెయ్యడం కన్న ఉన్న ఇమేజ్ ని రెట్టింపు చేసుకోవాలని సామ్ భావిస్తూ అందుకే ఆ పాత్రకి నో చెప్పేసింది సామ్. ఇక ఈ గెటప్ కోసం లక్ష్మి ని ఎంచుకున్నారని టాక్. ఈ సినిమాలో నాగశౌర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : అమ్మో మొగుడు పెళ్ళాల ఆట మాములుగా లేదుగా..?

You might also like