Saakshyam
Nothing scared but the truth

ప్లీజ్ బ్రదర్ ఒక్క హిట్ కావాలి…?

Again Sampath Nandi Direct To Gopichand || Telugu Movie News || Saakshyam

0

Again Sampath Nandi Direct To Gopichand || Telugu Film News || Saakshyam

వరుసగా అపజయాలను అందుకుంటున్న హీరోస్ లో చెప్పుకోదగ్గ హీరో ఒకరు ఉన్నారు అతనే గోపీచంద్ ( Again Sampath Nandi Direct To Gopichand ) … మొదటగా విలన్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన తరువాత తన అద్భుతమైన నటనతో హీరోగా చాన్సులు దక్కించుకున్నాడు.. అప్పట్లో వరుస విజయాలతో దుమ్ముదులిపెసాడు. కానీ ఈ మధ్య కాలంలో గోపీచంద్ కి అంతగా కలిసి రావడం లేదనే చెప్పుకోవాలి. వరుసగా ఫ్లాప్స్ ని ముటగట్టుకుంటున్నాడు, పైగా ఇప్పుడు ఇండస్ట్రీ లో కాంపిటిషన్ ఎక్కువగా నడుస్తుంది ఒక సినిమా అయిపోయే సరికి ఒక సినిమాని విడుదల చేస్తూ సక్సస్ లు అందుకుంటున్న స్టార్ హీరోస్ చాలామంది ఉన్నారు ఇక అలాంటి వారిపైన దర్శక నిర్మాతల కన్ను కూడా వెళ్తుంది, ఫ్లాప్స్ అందుకుంటున్న హీరోస్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రస్తుతం గోపీచంద్ విషయం లో కూడా అదే జరుగుతుంది. వస్తున్న ఫ్లాప్స్ తో బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డ్ బద్దలు కొట్టలేకపోతున్నాడు.

ఈ నేపధ్యంలో ఒక్క హిట్ కావాలి అంటూ గోపీచంద్ కష్టపడుతున్నాడు. మొన్న ఈ మధ్య కాలంలో సంపత్ నంది దర్శకత్వంలో గౌతంనంద సినిమా వచ్చింది ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీసు దగ్గర ఆశించని ఫలితం ఇవ్వలేకపోయింది. అయిన కూడా మరొకసారి సంపత్ నందితోనే తన నెస్ట్ సినిమా చెయ్యాలని గోపీచంద్ భావిస్తున్నారు.

Again Sampath Nandi Direct To Gopichand || Tollywood News || Saakshyam

అయితే ఈసారి చెయ్యబోయే సినిమా ప్రయోగాలకు పోకుండా పక్కా హిట్టయ్యే విధంగా సినిమా చేయాలని గోపిచంద్ డైరెక్టర్ తో డిస్కస్ చేశాడట. సంపత్ కూడా అందుకు సరిపోయే విధంగా ఒక స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డారట. విలైంత త్వరలో ఈ సినిమా పట్టలేక్కించాలని ఇద్దరు కూడా కష్టపడుతున్నారు. ఇక నిర్మాత రాధ మోహన్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. మరి ఈ మాస్ సినిమాతోనైనా గోపి గట్టిగా కొడతాడో లేదో చూడాలి.

Saakshyam comes with Telugu Political News,Tollywood news, Telugu Breaking News,Telugu Movie News, Telugu Film News, Latest Telugu News,Telugu Movie News,Telugu Cinema News ,Telugu News and Many More.

Read Another : ‘వినయ విధేయ రామ’ మార్నింగ్ షో టాక్…సినిమా ఎలా ఉందంటే…?

You might also like