Saakshyam
Nothing scared but the truth

హడావిడి మొదలెట్టేసిన వర్మ జనవరిలోనే ‘వర్మాస్ ఎన్టీఆర్’ …!!

0

Ram Gopal varma,  chandrababu,  balakrishna

వివాదాస్పద డైరెక్టర్ ఎవరు అంటే అది రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఎదో ఒక కంట్రవర్సి సృష్టింది ఎవరో ఒకరిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఒకవైపు మీడియాలో మరోవైపు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటాడు. అతకుమించి సినిమాలు కూడా అలాగే వివాదాస్పద సినిమాలు చేస్తూ ఉంటారు. గత కొద్ది రోజుల నుండి కాస్తా సైలెంట్ అయిపోయిన వర్మ మళ్ళి తన హడవిడిని మొదలెట్టేసాడు. ఈసారి ఏకంగా బాబు, అలాగే బాలయ్య కి షాక్ తగిలేలా తన మాటలకూ పదునుపెట్టి రంగంలోకి దిగారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ జోరుగా ఊపందుకుంది జనవరిలో విడుదల చెయ్యాలి అని క్రిష్, బాలకృష్ణ హడావిడి చేస్తున్నారు, ఈ నేపధ్యంలో వర్మ వారికీ ఒక గట్టి జలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అదేమిటంటే తను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాని విజయదశమి రోజు మొదలుపెట్టి, జనవరి చివరలో రిలీజ్ చేయాలన్నది వర్మ(Ram Gopal varma) ప్లాన్. అక్టోబర్ 19న ఈ ప్రాజెక్ట్‌పై తిరుపతిలో ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి డీటేల్స్ వెల్లడిస్తానని క్లారిటీ ఇచ్చేశాడు.

ప్రస్తుతం దానికి సంబంధించిన ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి పెళ్లి సమయంలో చంద్రబాబు ఉన్న కొన్ని ఫొటోస్ ని విడుదల చేసాడు, దీంతో పొలిటికల్, సినీ సర్కిల్స్‌ అటెక్షన్ ఒక్కసారిగా వర్మపై పడింది. వర్మ అంతటితో ఆగకుండా క్రిష్, బాలయ్య చేసే ఎన్టీఆర్ బయోపిక్ పైన కూడా కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేశారు, క్రిష్ చేసే ఎన్టీఆర్ బయోపిక్ లో లక్ష్మి పార్వతి కధ ఎంట్రీకి ముందే ముగిసిపోతుందని, తన లక్ష్మీస్ ఎన్టీఆర్.. లక్ష్మిపార్వతి ప్రవేశంతో మొదలవుతుందని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ లైఫ్‌లో లక్ష్మిపార్వతి రోల్ ఏమిటన్నదే వర్మ సినిమా బేస్‌లైన్ అని తేలిపోయింది. తిరుపతిలో జరిగే ముహూర్త కార్యక్రమానికి ఊహకు అందని అతిధుల్ని ఆహ్వానించబోతున్నాడట వర్మ. అయితే వర్మ ఈ సినిమా చెయ్యాలని అనుకున్నది ఇప్పుడు కాదు ఎప్పటినుండో ఈ సినిమా చెయ్యాలని అనుకున్నారు దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

కాని అప్పట్లో ఈ సినిమాపై టీడీపీ వైసీపీ పార్టీల మధ్య గొడవలు చెలరేగాయి వైసీపీ వెనుకుండి దీన్ని తెరకెక్కిస్తోందంటూ మాటల యుద్దమే జరిగింది. చివరకు అదంతా ఒట్టిదేనంటూ తేల్చేశాడు వర్మ. తాజాగా ఇప్పుడు మళ్ళి అదే టైటిల్ తో లైవ్ లైన్లోకి వచ్చారు. ఈసారి ఏకంగా డేట్ కూడా ఫిక్స్ చేసి చెప్పారు, ఇదంతా చూస్తుంటే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ని డిస్ట్రబ్ చెయ్యాలనే వర్మ ఇలా చేస్తున్నాడు అనే కధనాలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుంది ఇలాంటి సమయంలో చంద్రబాబు బాగోతం మొత్తం కూడా బయటపెట్టి ఎలేక్షన్స్ కి ఎఫెక్ట్ అయ్యేలా చెయ్యాలన్నదే వర్మ ప్లాన్ అన్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం ఈసారి అయిన వర్మ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో…

You might also like