Saakshyam
Nothing scared but the truth
Page Right

అన్న ఎన్టీఆర్ ను తలదన్నేలా పవన్ రాజకీయం…

0

Pawan kalyan, Chintamaneni Prabhakar, politics

ఇదేంటి ఇలా అంటున్నారు అని అనుకుంటున్నారా అన్న ఎన్టీఆర్ రాజకీయాన్ని ఎవ్వరు కూడా తలదన్నలేరు, ఆయనలా పరిపాలన కూడా ఎవ్వరు చెయ్యలేరు, మరి అన్న ఎన్టీఆర్ ని తలదన్నేలా పవన్ రాజకీయం ఏంటీ అని ఆలోచనలో పడ్డారా? అధికారంలోకి వచ్చే విషయంలో పవన్ కల్యాణ్ ఈ మాట అనడంలేదు లెండి! నిజానికి అచ్చంగా అధికారంలోకి వచ్చేస్తామనే నమ్మకం ఆయనలో కూడా లేదు. ఒకవేళ టైం బాగుంది వస్తే గిస్తే జనాలకు సేవలు అందించడమే తన లక్షమని అంతేగాని డబ్బులుకోసం పదవి రావాలని కోరుకోవడం లేదు అని గతంలో చెప్పారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఒక్క రూపాయికే ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచారు ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan kalyan) కూడా అదే తరహాలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలకోసం పనిచేస్తాను అని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి పదవి అనేది, చంద్రబాబు, లోకేష్, జగన్ కి వారసత్వమేమో గానీ.. తనకు మాత్రం బాధ్యత అని అందుకే అంత నిస్వార్థంగా పనిచేస్తానని పవన్ అంటున్నాడు.

 

తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో మరోసారి పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చింతమనేని పై ఫైర్ అయ్యారు, గత కొద్ది రోజుల క్రిందట కూడా ఇలాగె చింతమనేని పై వీపరీతంగా వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మళ్ళి ఇప్పడు అదే తరహాలో చింతమనేనిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. తొలగించకపోతే.. ఆయన మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ కు, గవర్నర్ కు తానే ఫిర్యాదు చేస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.గతంలో జనసేనతో పొత్తు పెట్టుకొని గెలిచినా చంద్రబాబు ఇప్పుడు అదే జనసేన విజయం సాధిస్తుందని భయపడి పంచాయితీ ఎలేక్షన్స్ పెట్టలేదని ఎద్దేవా చేశారు పవన్, పంచాయతీల్లో గ్రామాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉన్నదని, జనసేన గెలిస్తే తన పరువు పోతుందని చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు.

తనకు నలుగురు పిల్లలున్నారని, సర్పంచి ఎన్నికలకు తాను అనర్హుడినని, చంద్రబాబు ధైర్యంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని కూడా  పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. కాని బాబుకి ఆ ధైర్యం లేక ఇప్పుడు మళ్ళి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. చూద్దాం పవన్ కళ్యాణ్ రోజురోజుకి రాజకీయంగా బలంగా తయారౌతున్నారు మరి వచ్చే ఎన్నికలలో పవన్ ఎలాంటి విజయాన్ని వరిస్తారో…

You might also like