Saakshyam
Nothing scared but the truth
Page Right

చెప్పిన మాట వింటే ప్రతి సంవత్సరం దీపావళికి ఇలా ఎందుకు జరుగుతుంది…!!

50 Children suffer eye injuries on diwali in sarojini devi hospital | Saakshyam

0

Diwali, sarojini devi hospital, 50 Children

దీపావళి అంటే అందరి జీవితాల్లో వెలుగు నింపేది అందుకే ఆరోజు ఇంటినిండా దీపాలతో అలంకరించి ఆడవాళ్లు లక్ష్మి దేవి పూజ చేసుకుంటారు. కాని అలాంటి దీపావళి రోజే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. దానంతటికి కారణం ఈ జనాలే..దీపావళి రోజు ఎంజాయ్ చెయ్యాలి టపాసులు కాల్చుకోవాలి కానీ ఈ జనాలు ఈ మధ్య కాలంలో అతిగా టపాసులపైన మక్కువ పెంచుకుంటున్నారు దానివలన వారికీ ప్రమాదం జరగడమే కాదు ఇతరులకి కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ దీపావళి వస్తుంది అందరు ఆనందంతో పాటు కాస్తా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కాని ప్రస్తుతం ఉన్న యూత్ అవేమి పట్టించుకోకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు దాంతో ప్రమాదాలు తప్పడం లేదు చివరికి ప్రణాలపైకి తెచ్చుకుంటున్నారు.

ఇది ఇప్పుడు జరిగింది కాదు ప్రతి ఏడాది ఇలాగే జరుగుతుంది చాలామంది చేతులు కాల్చుకోవడం, లేదా కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం లాంటివి జరుగుతూనే ఉంటున్నాయి, ఇక అదే తరహాలో ఈ ఏడాది కూడా కొన్ని కుటుంబాలలో విషాదాన్ని నింపింది. టపాసులు పేలుస్తూ కళ్లకు గాయాలు కావడంతో అనేక మంది హైదరాబాద్ లోని సరోజినిదేవి (sarojini devi) కంటి ఆసుపత్రిలో చేరారు. ఈ సంవత్సరం, టపాసులు పేలుస్తూ ఏకంగా 50 మంది తమ కళ్ళకు గాయం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 50 మంది సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఆసుపత్రి సిబ్బంది వీరికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు ఆస్పత్రికి 50 మంది రాగా అందులో 8 మందికి కళ్ల పరిస్థితి విషమయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరికి శస్త్రచికిత్స నిర్వహిస్తామని తెలిపారు. ఇక మిగిలిన 42 మంది కళ్ళకు గాయలైనట్లు తెలుస్తుంది, ఇక వారికీ తగిన చికిత్స అందించి ఇంటికి పంపించినట్లు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ దీపావళి రోజు ఎంజాయ్ చెయ్యండి తప్పులేదు కాని కాస్తా పెద్దలు చెప్పిన మాటలు కూడా విని వాటిని పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండండి. అది మీకు మీ కుటుంబానికి అలాగే ఇతర వాళ్ళకి అందరికి మంచిది.

Click here : పాపం ప్రణయ్ అమృత పరిస్థితి లాగే మరొక జంట…!!

 

You might also like