Saakshyam
Nothing scared but the truth

మెగా ఫాన్స్ కి దీపావళి గిఫ్ట్ అదిరిపోయింది…?

0

Ram charan,  Vinaya vidheya rama,  First look,

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కి ఎంతటి విజయాన్ని అందించిందో ఇప్పుడు చెప్పుకోనవసరం లేదు, చరణ్ కేరియర్లోనే ఆ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఇక ఆ దూకుడుని మరింత రెట్టింపు చెయ్యాలని భావిస్తున్నాడు రామ్ చరణ్ దాంతో బోయపాటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు బోయపాటి గాని చరణ్ గాని ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కాని మెగా అభిమానులు మాత్రం వెయ్యి కళ్ళతో ఈ సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి ఈరోజు బోయపాటి దీపావళి కానుకగా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ని అందించారు. అదేమిటంటే చరణ్ (Ram charan) సినిమా టైటిల్ తోపాటు దీపావళి గిఫ్ట్ గా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

టైటిల్ లోగో విషయంలో కూడా చాలా శ్రద్ద తీసుకున్నారనే విషయం అర్థమవుతోంది. మొత్తానికి చరణ్ సినిమా పేరు ‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్ రెండు కూడా కిరాక్ అనిపించేలా ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే బోయపాటి ఈ సినిమాలో రామ్ చరన్ని పక్కా మాస హీరోగా చూపిస్తున్నట్లు తెలుస్తుంది, ఇక పోస్టర్ గనుక మాస్ ఆడియన్స్ చూస్తే ఉర్రూతలూగించడం ఖాయం అని తెలుస్తోంది. నవంబర్ 9వ తేదీ 10 గంటల 25 నిమిషాలకు టీజర్ కూడా విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇక ఈ మూవీ లో చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తుండగా , బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ రోల్ లో కనిపిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇక కాస్కోండి ఫాన్స్ వచ్చే సంక్రాంతి బరిలో ఈ సినిమా ఉండబోతుందట.

Click here : రెడీగా ఉండండి ఈ నవంబర్ 18 నే మోత మొదలు…?

You might also like