Saakshyam
Nothing scared but the truth
Page Right

స్వచ్ఛ భారత్ కు తూట్లు..పార్టీకి సంబంధించిన నేతే బహిరంగంగా మూత్ర విసర్జన

0

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పధకాలు కొన్ని అమల్లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే స్వచ్చ భారత్ ఈ కార్యక్రమం చేపట్టిన తరువాత అన్ని జిల్లాలలో మరుగుదోడ్లు అమల్లోకి వచ్చాయి అలాగే రోడ్లు అన్ని కూడా నీట్ గా కనిపిస్తున్నాయి, మల ముత్ర విసర్జనాలు కూడా కాస్తా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. అయిన కూడా కొంతమంది ఇంకా మారలేదు అలాగే ప్రవర్తిస్తున్నారు బహిరంగంగా మల మూత్ర విసర్జనాలు చేస్తూనే ఉన్నారు. అంతెందుకు మోడీ గారి పార్టీ లోని మంత్రే తాజాగా బహిరంగంగా మూత్ర విసర్జన చేసి స్వచ్ఛ భారత్ కు తూట్లు పడేలా వ్యవహరించారు. తాజాగా రాజస్థాన్ బీజేపీ నేత, మంత్రి శంభూ(Shambhu) సింగ్ ఖేటసర్ బహిరంగంగా మూత్ర విసర్జన చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజెన్లు ఆయనపై విరుచుకుపడ్డారు.

ఇతను ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్ మేర్ లో పర్యటన చేస్తూ అక్కడ ఒక గోడ పైన మూత్ర విసర్జన చేశారు ఇంకొక విషయం గొప్పగా చెప్పుకోవాలి అంటే అతను ఆ పని చేసిన గోడకి తమ బీజేపీ పార్టీ పోస్టర్ ఉండడం గమనార్హం. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ మొదలెట్టేశారు, తాజాగా ఆ ట్రోల్స్ పై అతను స్పందించి తానూ బీజేపీ పోస్టర్ వద్ద తాను మూత్ర విసర్జన చేయలేదని… ఆ ఫొటోలో ఉన్నది తాను కాదని ఓ సారి చెప్పారు. మరో సారి స్పందిస్తూ… బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయడం తప్పు కాదని, అయితే అది నిర్మానుష్య ప్రాంతమై ఉండాలని అన్నారు. ఒకసారి నేను కాదు అని చెప్పి మరోసారి నిర్మానుష్య ప్రాంతాలలో చేస్తే తప్పు కాదని ఇలా అతను ప్రవర్తించడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. పార్టీ నేతలే పాటించని కార్యక్రమాలు ప్రజలకు ఎందుకు అని వ్యాఖ్యానిస్తున్నారు.

 

You might also like