Saakshyam
Nothing scared but the truth
Page Right

చంద్రబాబు చిత్తూ చిత్తుగా ఓడిపోవడం పక్కా : హరీష్ రావు

Hareesh rao said about Chandrababu Politics | Saakshyam

0

Hareesh rao, Chandrababu, Politics

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై రోజురోజుకి వ్యతిరేకత మరింత పుంజుకుంటుంది, ఇప్పటివరకు జగన్, పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు పై విమర్శలు చేశారు అతని అవినీతిని వేలెత్తి చూపారు తాజాగా చంద్రబాబు గాలి తెలంగాణాలో కూడా సోకింది అక్కడ టీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు (Hareesh rao) చంద్రబాబు తీరుపై విమర్సల పర్వం గుప్పించారు. ఇప్పటికిప్పుడు ఏపీ లో ఎన్నికలు పెడితే అందులో చంద్రబాబు చిత్తూ చిత్తగా ఓడిపోతారు అంటూ కామెంట్స్ పేల్చారు. అంతటితో ఆగకుండా అసలు చంద్రబాబు అంటేనే మోసం, అతని మాటలు, మోసం, చేతలు మోసం మొత్తానికి జనాన్ని వేర్రోల్లని చేసి ఆడుకుంటున్నాడు, రైతు రుణమాఫీ అనిచెప్పి మోసంచేశాడు. డ్వాక్రా మహిళలకు మాఫీ అనిచెప్పి మోసంచేశాడు. అడుగడుగునా మోసమే. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చిత్తుచిత్తుగా ఓడిపోతారు.

ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రబాబు పెద్ద మోసగాడు అంటూ బాబు పాలనలో అందరు కంప్యూటర్స్ పట్టుకొని తిరగడమే తప్ప ఏరోజు కూడా పేదోడి దగ్గరకు వెళ్లి అతని కష్టాలు చూడలేదు పేదోడి ఆకలి పొట్టని చూడలేదు ఇలా ఉంది ఏపీ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. “చంద్రబాబు కంప్యూటర్ పట్టుకొని అంతా ఇదే అంటాడు. అది అన్నంపెట్టదు. పేదోడి కడుపు నింపదు. అంతా కంప్యూటర్ అని చెప్పి ఆయనకు ఆయన మోసం చేసుకుంటున్నాడు. ప్రజల్ని మోసం చేస్తున్నాడు.” ఇంకా ఎప్పటికి చంద్రబాబు మారారు ప్రజల్ని ఇలా మోసం చేస్తూనే ఉంటారు అంటూ తెలిపారు. ఇక చంద్రబాబు తో ఎవరు పొత్తు పెట్టుకున్న కుడా వారు పైకి ఎదగరు వారిని బాబు వాడుకొని మధ్యలోనే వదిలేస్తారు, తెలంగాణాలో జనాలకు ముఖం చూపించలేని బాబు ఇప్పుడు 2019 గెలుపు కోసం తెలంగాణాలో కాంగ్రెస్ ముసుగు కప్పుకొని వస్తున్నారని ఎద్దేవా చేశారు హరీష్.

సిగ్గులేని చంద్రబాబు ఢిల్లీకి పోయి సోనియా, రాహుల్ తో సమావేశమయ్యారు. సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు. అప్పుడు ఇటలీకి దెయ్యం అయిన సోనియా ఇప్పుడు దేవత ఎలా అవుతుంది అని బాబు ని ప్రశ్నించారు హరీష్, బాబు ఎప్పటికప్పుడు ప్లేట్ మారుస్తూ ఏదైనా తనకి అనుకూలంగా మార్చుకుంటారని అవసరం కోసమా ఎక్కడికి వెళ్లి ఎవరి కళ్ళు పట్టుకోవదనికైనా రెడీ గా ఉంటారు అని, అందుకే ఇప్పుడు గెలుపు కోసం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపి చేతులు కలిపి వచ్చారని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో చంద్రబాబు ఒక చెల్లని రూపాయి. అందుకే కాంగ్రెస్ ముసుగుతో వస్తున్నారు. ఇతడ్ని నమ్మొద్దు అంటూ అన్నారు.

Click here : జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన అమెరికా వైసిపి ప్రతినిధులు

You might also like