Saakshyam
Nothing scared but the truth
Page Right

విజయశాంతికి తృటిలో తప్పిన ప్రమాదం లేదంటే…?

0

Vijayashanthi, Accidentally, Mahabubnagar

సినీ ఇండస్ట్రీ లో రాములమ్మగా చెరగని ముద్ర వేసుకుంది విజయశాంతి, ఇక సినీ రంగాన్ని వదిలేసి తన దృష్టి మొత్తం కూడా రాజకీయాలపైన పెట్టింది గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సాయశక్తుల ప్రయత్నాలు చేసింది కాని కాంగ్రెస్ విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత రాములమ్మ రాజకీయాల్లో కనుమరుగైపోయింది దానికి కారణాలు కూడా లేకపోలేదు 2014 ఎన్నికల తరువాత తను అనారోగ్యం పాలౌడంతో కాస్తా రాజకీయాల్లో కనిపించడం మానేసాను మళ్ళి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం (Vijayashanthi) కోసం నేను దేనికైనా సిద్దంగా ఉన్నాను అని స్పష్టం చేసింది విజయశాంతి. తాజాగా విజయశాంతి మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేటలో ఒక సభలో పాల్గొన్నారు ఆ సమయంలో అక్కడ ఉహించని విధంగా ఒక సంఘటన జరిగింది. విజయశాంతి సభ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా సభా వేదిక కుప్పకూలిపోయింది.

విజయశాంతికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది. వెంటనే, అప్రమత్తమైన మహిళా కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. లేదంటే విజయశాంతి కి తీవ్ర గాయాలు తగిలేవని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటన జరిగిన సమయంలో అక్కడ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, నంది ఎల్లయ్య తదితర నాయకులు స్టేజ్ పై కూర్చుని ఉన్నారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇది అంత ఎందుకు జరిగింది అని విచారణ చేస్తే సభ సరిగ్గా లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఏది ఏమిన్ అవిజయసంటి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడినట్లు తెలుస్తుంది.

You might also like