Saakshyam
Nothing scared but the truth
Page Right

బనానా ఫోన్ ఫీచర్స్ అదిరిపోయాయిగా…!!

0

Banana Shape, Latest Features, Smart Phone

దేశంలో స్మార్ట్ ఫోన్స్ హావ మాములుగా లేదు, జనాలు ఆ స్మార్ట్ ఫోన్ కి ఇచ్చే వాల్యూ లో కనీసం ఇంట్లో వాళ్ళకి 10 % కూడా ఇవ్వడం లేదు పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకోనేవరకు కూడా ఆ స్మార్ట్ ఫోన్ లోనే ఉంటున్నారు. ప్రపంచం మొత్తం కూడా తమ అరచేతిలోని స్మార్ట్ ఫోన్ లోనే చూసేస్తున్నారు. దానికి తోడూ స్మార్ట్ ఫోన్స్ కంపెనీలు కూడా ఎప్పటికికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ తో కొత్త కొత్త మొబైల్స్ ని మార్కెట్ లోకి వదులుతున్నారు. ఈ నేపధ్యంలో జనాలు కూడా వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టేస్తున్నారు తక్కువ డబ్బులతో ఎక్కువ ఫీచర్స్ ని అందించడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ ని వాడుతున్నారు. తాజాగా హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ సరికొత్త బనానా స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. ‘నోకియా 8110 4జీ బనానా ఫోన్’ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

 

అరటిపండు ఆకృతిలో(Banana Shape) వంపు కలిగి ఉండడం ఈ ఫోన్ ప్రత్యేకత. ఇప్పటికే ఈ ఫోన్ నేట్టింట్లో హల్చల్ చేస్తుంది సరికొత్త ఆకారంతో కొత్త ఫీచర్స్ తో దుమ్ముదులిపెస్తుంది. ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఈ ఫోన్లో జియో ఫోన్ లో ఉపయోగించే ‘కై’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసేలా తాయారు చేశారు. ఈ 4జీ ఫీచర్‌ స్మార్ట్‌ఫోన్‌లో గతంలో ఆదరణ పొందిన కీప్యాడ్‌ స్లైడర్‌ విధానాన్ని చేర్చారు. ఇక ఈ ఫోన్ ధర రూ.5,999గా సంస్థ నిర్ణయించింది. అన్ని 4 జీ మొబైల్స్ లాగే ఈ ఫోన్ లో కూడా వాట్స్ అప్, పేస్ బుక్, ట్విట్టర్ అన్ని వాడుకలో ఉంటాయి అని స్పష్టం చేశారు. ఈ ఫోన్ అక్టోబర్ 24 నుండి మార్కెట్ లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు..

ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..

* డిస్‌ప్లే: 2.45 అంగుళాల కర్వ్‌డ్‌ డిస్‌ప్లే
* రిజల్యూషన్: 240 x 320 పిక్సెల్స్.
* ఆపరేటింగ్ సిస్టం: కై
* ప్రాసెసర్: 1.1 గిగా హెట్జ్ డ్యూయల్ కోర్
* కెమెరా: 2 మెగా పిక్సల్‌ బ్యాక్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్‌.
* ర్యామ్: 512 ఎంబీ
* స్టోరేజ్: 4 జీబీ
* డ్యుయల్‌ సిమ్‌ (మైక్రో+నానో)
* 4జీ ఓల్ట్‌, హాట్‌స్పాట్‌, వైఫై.
* 1500 ఎంఏహెచ్‌ బ్యాటరీ .

మరి ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి బనానా స్మార్ట్ ఫోన్ తో ఎంజాయ్ చెయ్యండి…

You might also like