Saakshyam
Nothing scared but the truth
Page Right

అరవింద వలన బెంగ తీర్చుకున్న బన్ని…!!

0

అల్లు అర్జున్ని(Alu Arjun) ఈ విధంగా ఎప్పుడు చూసి ఉండి ఉండము, ప్రస్తుతం ఇండస్ట్రీ లో చిన్న హీరో కూడా ఒక సినిమా అయిపోయే సరికి మరో సినిమాకి సైన్ చేస్తున్నారు కానీ స్టార్ హీరో అయి ఉండి కూడా బన్నీ ఇప్పటి వరకు మరో సినిమాకి సైన్ చెయ్యలేదు. నా పేరు సూర్య సినిమా బన్నీ కి మంచి హిట్ ఇస్తుందని భావించాడు కాని ఆ సినిమా ఊహించని రేంజ్ లో ఫ్లాప్ ని అందించింది దాంతో బన్నీ బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు ఆ సినిమా అయిపోయి ఇప్పడికి ఏడు నెలలు కావొస్తుంది ఇంకా వేరే సినిమాకి సైన్ చెయ్యలేదు. అల్లు అర్జున్ ఇప్పటివరకు సినిమా చేయ్యకపోవడంతో సోషల్ మీడియాలో అనేకరకాలుగా కధల వినిపించాయి. అయితే మనం సినిమాతో మంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ బన్నీ కి కధని వినిపించిన కూడా అతను ఫస్ట్ హాఫ్ వరకు ఒకే సెకండ్ హాఫ్ లో మార్పుల చేర్పులు చెయ్యండి తరువాత ఆలోచిద్దాం అని చెప్పుకొచ్చారు. ఇంకా చాలామంది బన్నీ కి కధలు వినిపించనా కూడా అతను ఒకే చెయ్యడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు బన్నీ కొత్త కొత్త కధలతో కొత్తగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు, ఇకపై ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట.

అయితే అలాంటి ఫ్యామిలీ కంటెంట్ సినిమా కావాలి అంటే ఇండస్ట్రీ లో పెర్ఫెక్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్. త్రివిక్రమ్ కోసం బన్నీ(Alu Arjun) గత కొద్ది రోజుల నుండి వెయిట్ చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన అరవింద సమేత విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక అది చూసిన బన్నీ కాస్తా బెంగ తీర్చుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అగ్నతచాసి సినిమాతో త్రివిక్రమ్ భారీ డిజాస్టర్ ని అందుకున్నారు ఆ తరువాత అరవింద సమేత తో మంచి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బన్నీ ఇప్పుడు తన చూపు మొత్తం త్రివిక్రమ్ పైన పెట్టేసినట్లు అర్ధమౌతుంది. ఇప్పటికే అతని వైపు నుంచి త్రివిక్రమ్‌కి కాల్‌ వెళ్లిందట. కానీ త్రివిక్రమ్‌ రెండు నెలల సమయం అడిగాడట. ఎందుకంటే తన దగగ్ర ఇప్పుడు కధలూ ఏమి లేవని ఒక రెండు నెలలు సమయం కావాలని తెలిపారట. దాంతో బన్నీ కాస్తా ఉపిరి పిల్చుకుంటున్నట్లు తెలుస్తుంది. అది మరి మ్యాటర్…

You might also like