Saakshyam
Nothing scared but the truth
Page Right

జగన్ హామీలు కాపీ కొట్టి చరిత్రలో కాపీ రాయుడుగా మిగిలిపోయిన బాబు…!!

0
నిజానికి అప్పట్లో అది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఆ హామీని గురించి అప్పట్లో టీడీపీ నేతలు కామెంట్స్ కూడా వేశారు, అంతెందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు కూడా అవహేళన చేశారు అసలు 45 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి పించన్లు ఏంటీ అని ఎద్దేవా చేశారు కాని ఇప్పుడు అదే హామీని చంద్రబాబు కూడా ఫాల్లో అవుతున్నారు జగన్ హామీని కాపీ కొట్టి చరిత్రలో కాపీ రాయుడుగా బాబు అవతరించాడని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణ సీఎం పథకాలు కాపీ కొట్టిన చంద్రబాబు.. మళ్ళి తాజాగా జగన్ పాదయాత్ర లో చేస్తున్న హామీలు అన్ని కూడా కాపీ కొడుతూ తన సొంత నిర్ణయాలు అంటూ ప్రకటనలు చేస్తుంటే చూసినవాళ్ళు అందరు కూడా నవ్వుకుంటున్నారు. గతంలో వైసీపీ అధినేత జగన్ వృద్ద వయసులో జనాలు పనులు చేసుకోలేక అవస్తలు పడుతూ పూట కూడా గడవని వాళ్ళని చూసి జగన్ చలించిపోయి 45 వయసు ఉన్న అందరికి పించన్లు ఇస్తామంటు హామీ ఇచ్చారు,
అలాంటి నిరుపేదలకు కడుపు నిండేలా అన్నం పెడుతున్నారు, వాళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని ప్రకటించాడు.  తీరా చూస్తే అప్పుడు అది సాధ్యం కాదని బీరాలు పలికిన టీడీపీ అధినేత.. ఇప్పుడు అదే హామీని ఇస్తున్నాడు. తాజాగా ఈ హామీని చంద్రబాబు అధికారకంగా ప్రకటన చేశారు. అయితే బాబు తెలివిగా ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు అదేమిటంటే జగన్ 45 సంవత్సరాల వాళ్ళకి పెంక్షన్ ఇస్తా అని హామీ ఇస్తే చంద్రబాబు మాత్రం 50 ఏళ్లు ఉన్న వారికి మాత్రమే పింఛన్ ఇస్తానని తాజాగా  ప్రకటించారు. ఐదేళ్ల వ్యత్యాసాన్ని పెంచి బాబు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే జగన్ ఈ హమికి అన్ని కులాలు అన్ని మతాలు అర్హులేనని హామీ ఇచ్చారు కానీ బాబు మాత్రం కులాన్ని బట్టి పించన్ ఇస్తామంటూ ప్రకటన చేశారు. ఏది ఏమైనా బాబు ఒక కాపీ రాయుడుగా దేశాన్ని ఎలుతున్నాడు.
You might also like